Thursday, May 2, 2024

Tokyo Olympics:కాంస్య పతక పోరులో భారత అమ్మాయిలు ఓటమి..

టోక్యో ఒలింపిక్స్‌ హాకీ కాంస్య పతక మ్యాచ్‌లో భారత అమ్మాయిలు ఓటమి పాలయ్యారు. హోరాహోరీగా సాగిన ఆ మ్యాచ్‌లో బ్రిట‌న్ 4-3 గోల్స్ తేడాతో ప‌త‌కాన్ని సొంతం చేసుకున్న‌ది. తుద వ‌ర‌కు ఇండియ‌న్ వుమెన్ పోరాడినా.. ఫోర్త్ క్వార్ట‌ర్స్‌లో చేతులెత్తేశారు. దీంతో ఒలింపిక్స్ హాకీలో చ‌రిత్ర సృష్టించే అద్భుత అవ‌కాశాన్ని మ‌హిళ‌ల జ‌ట్టు మిస్సైంది. ఫలితంగా హాకీలో భారత్‌కు మరో పతకం వస్తుందన్న అభిమానుల ఆశలు అడియాసలయ్యాయి.

తొలి క్వార్ట‌ర్‌లో రెండు జ‌ట్లు గోల్ చేయ‌లేక‌పోయాయి. స‌వితా పూనియా అద్భుత‌మైన రీతిలో గోల్ పోస్టు వ‌ద్ద బ్రిట‌న్ దూకుడును అడ్డుకున్న‌ది. ఇక సెకండ్ క్వార్ట‌ర్‌లో గోల్స్ వ‌ర్షం కురిసింది. బ్రిట‌న్ రెండు గోల్స్ చేయ‌గా.. ఇండియ‌న్ వుమెన్ మూడు గోల్స్ చేశారు. గుర్జిత్ కౌర్ రెండు గోల్స్ చేసింది. మ‌రో ప్లేయ‌ర్ వంద‌నా క‌టారియా త‌న డ్రాగ్ ఫ్లిక్‌తో మ‌రో గోల్‌ను ఇండియాకు అందించింది. దీంతో రెండ‌వ క్వార్ట‌ర్‌లో ఇండియా త‌న ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఇక మూడ‌వ క్వార్ట‌ర్ కూడా ఆస‌క్తిక‌రంగా సాగింది. గోల్ పోస్టును టార్గెట్ చేస్తూ దూకుడు ప్ర‌ద‌ర్శించిన బ్రిట‌న్ అమ్మాయిలు.. ఆ క్వార్ట‌ర్‌లో ఒక గోల్ చేశారు. దీంతో రెండు జ‌ట్లు 3-3 గోల్స్‌తో స‌మంగా నిలిచాయి. టెన్ష‌న్‌గా మారిన నాలుగ‌వ క్వార్ట‌ర్‌లో.. బ్రిట‌న్ వుమెన్ త‌మ జోరును ప్ర‌ద‌ర్శించారు. 48వ నిమిషంలో గ్రేస్ బ‌ల్స‌డ‌న్ గోల్ చేయ‌డంతో బ్రిట‌న్‌కు ఆధిక్యం దక్కింది. చివ‌రి క్వార్ట‌ర్‌లో భార‌త మ‌హిళ‌లు తీవ్రంగా శ్ర‌మించినా ఫ‌లితం ద‌క్క‌లేదు.అయినప్పటికీ చివరి వరకు పోరాడిన భారతజట్టు త్రుటిలో పతకాన్ని చేజార్జుకుంది.

, ఇది కూడా చదవండి: ఆర్ఆర్ఆర్: ఐడీ కార్డు ధరించిన ఎన్టీఆర్, జక్కన్న..

Advertisement

తాజా వార్తలు

Advertisement