Monday, March 18, 2024

ఆర్ఆర్ఆర్: ఐడీ కార్డు ధరించిన ఎన్టీఆర్, జక్కన్న..

ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం ఉక్రెయిన్ లో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే రాజమౌళి చిత్రం తెరకెక్కించిన ఆ యూనిట్ అందరికీ ఐడి కార్డులు జారీ చేయడం మొదటి నుంచి అనుసరిస్తున్న పద్ధతి. అయితే తాజాగా ఐడి కార్డు ధరించిన జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. సెట్స్ పై మెడలో ఐడీ కార్డు వేసుకున్న ఫొటోలను జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ ఐడీ కార్డు ధరించానని ఎన్టీఆర్ వెల్లడించారు. సెట్స్ మీద ఉండగా ఐడీ కార్డు వేసుకోవడం ఇదే ప్రథమం అని తెలిపారు. ఎన్టీఆర్ పంచుకున్న ఫొటోలో తన ఐడీ కార్డు చూపిస్తూ దర్శకుడు రాజమౌళి కూడా కనిపించాడు. కాగా, ఎన్టీఆర్ ఐడీ కార్డుపై ఫొటో, నందమూరి తారక రామారావు, హీరో అని రాసి ఉంది. ఐడీ కార్డు పైభాగంలో చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ పేరు, ఆర్ఆర్ఆర్ అనే అక్షరాలు ముద్రించారు.

ఇది కూడా చదవండి: ఫ్లిప్‌కార్ట్‌కు రూ.10 వేల కోట్ల జరిమానా.. ఎందుకో తెలుసా?

Advertisement

తాజా వార్తలు

Advertisement