Wednesday, May 1, 2024

అమెజాన్ లో జై భీమ్… అఫీషియల్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. కెరీర్ ప్రారంభం నుంచి కూడా డిఫరెంట్ స్టోరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉన్నారు సూర్య. గతేడాది ఆకాశం నీ హద్దురా సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్నాడు సూర్య. అదే జోష్ తో సూర్య వరుస సినిమాలలో నటిస్తున్నాడు. అందులో టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అదే జై భీమ్. సూర్య కెరీర్ లో 39 వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ టి టి లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రకటించారు. ఇక ఈ సినిమాలో గిరిజన సంఘాల హక్కుల కోసం వారి భూముల కోసం పోరాడే న్యాయవాదిగా సూర్య సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో రజీష విజయన్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement