Tuesday, April 23, 2024

మహిళలకు శుభవార్త….తగ్గిన బంగారం ధరలు

ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అయితే మగువలు మాత్రం బంగారం అంటే పడి చచ్చిపోతారు. కాగా గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు… మరోసారి తగ్గుముఖం పట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్ ధరల ప్రకారం… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 100 తగ్గి రూ. 44,800 కి చేరింది.

అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 100 తగ్గి రూ. 48,880కి చేరిది. మరోవైపు బంగారం ధ‌ర‌లతో పాటు వెండి ధ‌ర‌లు కూడా తగ్గుతున్నాయి. కిలో వెండి ధ‌ర రూ. 800 తగ్గి రూ. 72,300కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement