Wednesday, May 8, 2024

ఈ వారం ఓటీటీలో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న‌ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..!

కొవిడ్ త‌ర్వాత సినిమా రంగం ఓ పెద్ద స‌వాల్‌ని ఎదుర్కొంటోంది. ఈ మ‌ధ్య‌కాలంలో థియేట్రికల్ మార్కెట్ కంటే, OTT మార్కెట్ గణనీయంగా పెరుగుతోంది. దీంతో రెగ్యులర్ సినీ ప్రేమికులు, ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా ఓటీటీలకే అలవాటుప‌డుతున్నారు. కొన్ని సినిమాల‌కు థియేట‌ర్ దాకా వెల్లే అంత బ‌జ్ క్రియేట్ కాక‌పొవ‌డంతో.. బాక్సాఫాస్ వద్ద అవి ఫ్లాప్ లుగా నిలిచిపోతున్నాయి. ఇక, ఈ వారం ఓటీటీలో ఫ్యామిలీ, ఎంట‌ర్‌టైన్‌మెంట్ కథాంశాలతో రూపొందిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రిలీజ్ కాబోతున్నాయి. ఆ సిరీస్‌లు, సినిమాలు ఏంటో చ‌దివి తెలుసుకుందాం!

1.రంగ రంగ వైభ‌వంగా – అక్టోబ‌ర్ 2-నెట్‌ఫ్లిక్స్‌..

మెగా హీరో వైష్ణ‌వ్‌తేజ్, కేతికా శ‌ర్మ జంట‌గా న‌టించిన రంగ‌రంగ వైభ‌వంగా సినిమా అక్టోబ‌ర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. స్నేహం, ప్రేమ అంశాల‌కు కుటుంబ బంధాల‌ను జోడిస్తూ ద‌ర్శ‌కుడు గిరీశాయ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. సెప్టెంబ‌ర్ 2న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా యావ‌రేజ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది.

2. ప్లాన్ ఏ ప్లాన్ బీ- సెప్టెంబ‌ర్ 30 -నెట్‌ఫ్లిక్స్‌

- Advertisement -

3.ఫ‌రెవ‌ర్ క్వీన్స్ సీజ‌న్ 1- అక్టోబ‌ర్ 2- నెట్‌ఫ్లిక్స్‌

త‌మ‌న్నా, రితేష్ దేశ్‌ముఖ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన బాలీవుడ్ చిత్రం ప్లాన్ ఏ ప్లాన్ బీ సెప్టెంబ‌ర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో రితేష్ దేశ్‌ముఖ్ విడాకుల లాయ‌ర్‌గా క‌నిపించ‌నుండ‌గా త‌మ‌న్నా మ్యారేజీ బ్యూరో నిర్వ‌హ‌కురాలిగా న‌టిస్తోంది. శ‌శాంక ఘోష్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.
ఎంట‌ర్‌గ‌లాక్టిక్ – సెప్టెంబ‌ర్ 30- నెట్‌ఫ్లిక్స్‌

4.హోక‌స్ పోక‌స్ 2 – సెప్టెంబ‌ర్ 30 డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌

5.క‌ర్మ యుద్ధ్ సిరీస్ -సెప్టెంబ‌ర్ 30- డిస్నీప్ల‌స్‌హాట్‌స్టార్‌

6.పృథ్వీరాజ్ సుకుమారన్ తీర్పు- సెప్టెంబర్ 30- డిస్నీ ప్లస్ హాట్ స్టార్

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సిరీస్‌లో స‌తీష్ కౌషిక్‌, అషుతోష్ రాణా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్ ద్వారా ఈ సిరీస్ రిలీజ్ కానుంది.

7.రేయికి వేయిక‌ళ్ళు- సెప్టెంబ‌ర్ 30 -ఆహా

అరుణ్‌నిధి స్టాలిన్‌, అజ్మ‌ల్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ చిత్రం ఇర‌వుక్కు అయిర‌మ్ కంగ‌ల్ తెలుగులో రేయికి వేయిక‌ళ్ళు పేరుతో డ‌బ్ కానుంది. సెప్టెంబ‌ర్ 30న ఆహాలో ఈ థ్రిల్ల‌ర్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

8.బుల్లెట్ ట్రైన్ -సెప్టెంబ‌ర్ 29 -జీ5

9.కెప్టెన్ – సెప్టెంబ‌ర్ 30 – జీ5

ఆర్య‌, ఐశ్వ‌ర్య‌ల‌క్ష్మి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ చిత్రం కెప్టెన్ సెప్టెంబ‌ర్ 30న జీ5 ఓటీటీలో రిలీజ్ కానుంది. ఫాంట‌సీ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు శ‌క్తి సౌంద‌ర్‌రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ చేయ‌బోతున్నారు.

10.మై బెస్ట్ ఫ్రెండ్ ఎక్సోర్సిజం -సెప్టెంబ‌ర్ 30 -అమెజాన్ ప్రైమ్‌

11.777 ఛార్లి – సెప్టెంబ‌ర్ 30 – అమెజాన్ ప్రైమ్‌

కన్నడ సినిమా 777 ఛార్లి క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌తో పాటు విమ‌ర్శ‌కుల మ‌న్న‌న‌ల్ని అందుకున్న‌ది. ధ‌ర్మ అనే ఓ యువ‌కుడికి ఛార్లి అనే డాగ్‌తో ఏర్ప‌డిన అనుబంధం నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 30న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. రెంట‌ల్ విధానంలో 777ఛార్లి రిలీజ్ కానుంది. ర‌క్షిత్ శెట్టి హీరోగా న‌టించిన ఈ చిత్రానికి కిర‌ణ్‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement