Tuesday, May 21, 2024

నితిన్ గ‌డ్క‌రీ కీల‌క ప్ర‌క‌ట‌న – ఇక‌పై ప్ర‌తి కారులో ఆరు ఎయిర్ బ్యాగులు త‌ప్ప‌ని స‌రి

కేంద్ర ర‌వాణాశాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇక‌పై ప్ర‌తి కారులో క‌నీసం 6 ఎయిర్ బ్యాగులు ఉండాల్సిందేన‌ని తెలిపారు. ప్ర‌యాణికుల భ‌ద్ర‌త దృష్ట్యా ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా ఆయ‌న ప్ర‌క‌టించారు. కార్ల వేరియంట్లు, ధ‌ర‌ల‌తో ఏమాత్రం సంబంధం లేకుండా ప్ర‌తి కారులో క‌నీసం 6 ఎయిర్ బ్యాగులు ఉండాల్సిందేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో టాటా స‌న్స్ మాజీ చైర్మ‌న్ సైర‌స్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. ప్రమాద స‌మయంలో కారు వెనుక సీట్లో కూర్చున్నా… మిస్త్రీ చ‌నిపోయారు. ఈ ప్ర‌మాదంపై స‌మ‌గ్ర అధ్య‌య‌నం చేసిన కేంద్ర ప్ర‌భుత్వం…ఇక‌పై జ‌రిగే ప్ర‌మాదాల్లో ముందు సీట్ల‌లో కూర్చున్న వారే కాకుండా వెనుక సీట్ల‌లో కూర్చున్న వారు కూడా సుర‌క్షితంగా ఉండాల‌న్న ఉద్దేశ్యంతోనే ఈ స‌రికొత్త నిబంధ‌న‌ను అమలులోకి తీసుకువ‌చ్చింది.ఇక‌పై ప్ర‌తి కారులో 6 ఎయిర్ బ్యాగులు ఉండేలా కేంద్ర ప్ర‌భుత్వం క‌ఠిన నిబంధ‌న‌ను అమ‌లులోకి తీసుకొస్తోంది. అక్టోబ‌ర్ 1 నుంచే ఈ నిబంధ‌న‌ను అమ‌లులోకి తీసుకురానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement