Sunday, May 12, 2024

ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ అప్డేట్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు అభిమానులలో ఆసక్తిని రేపింది. ఏప్రిల్ 13 నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చి మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట.

అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ 19న ఈ సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఇప్పటికే ఈ సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. రాజకీయ నేపథ్యంలోనే సినిమా ఉండనుందని తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నారట. గతంలో త్రివిక్రమ్, ఎన్టీఆర్ లు కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement