Sunday, April 28, 2024

Salaar | రూ.625 కోట్ల‌తో స‌లార్ ప్రభంజనం.. క‌లెక్ష‌న్ల‌లో త‌గ్గ‌నంటున్న ప్ర‌భాస్

ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలలో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా సాలార్: సీజ్ ఫైర్. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ప్రభాస్ మాస్ కటౌట్ కి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తొలిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా టోటల్ గా 178.7 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. కాగా, ఇప్పటివరకు 625 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మేకర్స్ ప్రకటించారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 200 కోట్ల పైగా కలెక్షన్స్ ని అందుకున్న ఈ మూవీ నార్త్ స్టేట్ లో 100 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఓవర్ సీస్ మార్కెట్ నార్త్ అమెరికాలో దాదాపు 8 మిలియన్ డాలర్స్ అందుకున్న ఈ చిత్రం.. ఆస్ట్రేలియాలో 1.5 మిలియన్ డాలర్స్ వరకు అందుకుంది. ఇలా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 625 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. కాగా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 345 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement