Thursday, May 2, 2024

సింగిల్స్ కోసం… విశ్వక్ సేన్ వచ్చేస్తున్నాడు!!

ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నూమదాస్, హిట్… చిత్రాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం నరేష్ కుప్పిలి దర్శకత్వంలో పాగల్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సిమ్రాన్ చౌదరి మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ఈ కష్ట సమయంలో మా బ్రాండ్ న్యూస్ సాంగ్ తో చిల్ చేయాలనుకుంటున్నాం. జూన్ 2న సాయంత్రం ఐదు గంటలకు సింగిల్ చిన్నోడే సాంగ్ స్పెషల్ గా సింగిల్స్ కోసమే విడుదల చేయబోతున్నాం అంటూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విశ్వక్ లుక్ సినిమాపై అంచనాలు పెంచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement