Thursday, May 2, 2024

తెలంగాణ లో తగ్గిన కరోనా కేసులు….కొత్తగా ఎన్నో తెలుసా ?

తెలంగాణ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 87,110 మందికి క‌రోనా నిర్ధార‌ పరీక్షలు చేయగా 2,524 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరోవైపు కరోనా కారణంగా 18 మంది మృతి చెందారు.అలాగే 3,464 మంది కరోనా నుంచి గడిచిన 24 గంటల్లో కొలుకున్నారు.

ఇక తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 5.78 ల‌క్ష‌ల మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. అందులో 5.40 ల‌క్ష‌ల‌ మంది కోలుకున్నారు.అలాగే ఈ మహమ్మారి కారణంగా మొత్తం 3,281 మంది ప్రాణాలు కోల్పోయారు.అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం 34,084 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement