Thursday, May 16, 2024

టీజర్ సిద్ధం…మార్చి 27 రావటమే ఆలస్యం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కూడా నటించాడు. ఇదిలా ఉండగా మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలోనే ఆర్ ఆర్ ఆర్ మూవీ నుంచి అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

గతేడాది మార్చి 27 పుట్టిన రోజు సందర్భంగా ఆర్ఆర్ ఆర్ నుంచి రామ్ చరణ్ టీజర్ ను రాజమౌళి రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఈ ఏడాది మరో టీజర్ కూడా సిద్ధమైందని తెలుస్తోంది. ఇక ఆ సమయం కోసం అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఎలా ఆ టీజర్ ఉండబోతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement