Monday, May 6, 2024

షూటింగ్ పూర్తి చేసుకున్న గామి.. ప్ర‌క‌టించిన మూవీ యూనిట్

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ మాస్ ఎంటర్టైనర్ దాస్ కా ధమ్కీలో కనిపించాడు. స్వయం దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ అండ్ OTT స్పేస్‌లో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ సోంతం చేసుకుంది. ఇక ఇప్పుడు చాలా కాలం నుండి వేయిటింగ్ లో ఉన్న విశ్వ‌క్ సినిమా గామి వార్త‌ల్లో నిలిచింది.

విద్యాధర్ కవిత దర్శకత్వం వహించిన గామి సినిమాలో విశ్వక్సేన్‌ను మునుపెన్నడూ లేని పాత్రలో క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమాలో అత‌ను అఘోరాగా కనిపించనున్నాడు. తాజా సమాచారం ప్ర‌కారం ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయి రిలీజ్ సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ ఫాంటసీ అడ్వెంచర్‌లో ప్రధాన పాత్ర పోషించిన చాందిని చౌదరి తన సోషల్ ప్రొఫైల్స్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. MG అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి మరియు హారిక పెడద ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం. వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ బ్యాంక్రోల్ చేసిన ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement