Saturday, April 27, 2024

నారప్ప రిలీజ్ కి ముహూర్తం అదేనా ?

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో ధనుష్ నటించిన అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. కాగా ఈ సినిమా రిలీజ్ పై గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి.

థియేటర్స్ తెరుచుకోగానే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి నిర్మాత సురేష్ బాబు సన్నాహాలు చేస్తున్నారని మొదట టాక్ నడిచింది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్టు మొదటి వారంలో రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. మరోవైపు వెంకటేష్ నటించిన దృశ్యం2 త్వరలో ఓటీటీ లో రిలీజ్ కాబోతుంది. అలాగే మరో చిత్రం ఎఫ్3 షూటింగ్ దశలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement