Thursday, May 9, 2024

కలెక్టర్లు అంతా సిద్ధం కావాలి.. వాటిపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్

జగనన్న శాశ్వత భూహక్కు కార్యక్రమం కోవిడ్‌కారణంగా ఆశించినంత వేగంగా కదల్లేదని సీఎం జగన్ అన్నారు. ఇది పూర్తయితే వివాదాలకు పూర్తిగా చెక్‌ పడుతుందన్నారు.  స్పందన కార్యక్రమంపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారం  వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జగనన్న శాశ్వత భూహక్కు కార్యక్రమంపై దృష్టిపెట్టాలని అధికారులకు ఆదేశించారు. క్రమం తప్పకుండా స్పందనలో దీనిపై రివ్యూ చేస్తానని తెలిపారు. కోర్టు కేసుల కారణంగా 3,70,201 మందికి ఇళ్లస్థలాలు రాలేదని, పేదవాడికి ఇంటి పట్టాలు రాకూడదని టీడీపీ లాంటి ప్రతిపక్షాలు అన్యాయంగా కేసులువేసి అడ్డుకున్నాయని చెప్పారు. ఇప్పుడు హైకోర్టు సెలవులు కూడా ముగిశాయని, ఇలాంటి కేసులమీద దృష్టిపెట్టాని సీఎం  సూచించారు. ప్రతిరోజూ రివ్యూ చేసి చర్యలు తీసుకోండి. కలెక్టర్లు, జేసీలు ఈ కేసులు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనివల్ల 3.7లక్షలకుపైగా కుటుంబాలకు ఎనలేని మేలు జరుగుతుందన్నారు. అలాగే 90 రోజుల్లోగా ఇంటి పట్టాలు ఇవ్వడంపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు.

తొలివిడతలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని సీఎం జగన్ తెలిపారు. జగనన్నకాలనీల్లో 4,120 కాలనీల్లో తాగునీరు, కరెంటు ఏర్పాటు చేశారన్న సీఎం.. మిగిలిపోయిన కాలనీల్లో జూన్‌ నెలాఖరు కల్లా తాగునీరు, కరెంటు సౌకర్యాలను ఏర్పాటు పూర్తికావాలన్నారు. సొంత స్థలాలు ఉన్నవారికి 3.84 ఇళ్లు ఇచ్చామని, వాటిని శరవేగంగా పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలన్నారు. ఇళ్లనిర్మాణం విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో క్రమం తప్పకుండా సమీక్షలు చేయాలని సూచించారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుస్తాయని, తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.  జూన్‌ 22న చేయూత పథకాన్ని అమలు చేస్తున్నాని సీఎం వెల్లడించారు. జులైలో విద్యాదీవెన, కాపు నేస్తం పథకాలు అమలు చేస్తామన్నారు. దీనికి సంబంధించి కలెక్టర్లు సిద్ధం కావాలన్నారు. వైఎస్సార్‌ బీమా జులై 1న ప్రారంభం అవుతుందని అని సీఎం జగన్‌ తెలిపారు.

అలాగే నకిలీలకు ఆస్కారం లేకుండా నాణ్యమైన విత్తనాలు రైతులకు అందాలని సీఎం స్పష్టం చేశారు. ప్రీమియం విత్తనాలు కూడా ఆర్బీకేల ద్వారా రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలి సూచించారు. నకిలీలకు ఆస్కారం ఉండదని,  బ్లాక్‌మార్కెటింగ్‌ కూడా ఉండదని స్పష్టం చేశారు. మిర్చి, పత్తి, తదితర పంటలకు సంబంధించి ప్రీమియం విత్తనాలను ఆర్బీకేల ద్వారా అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement