Monday, May 20, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 12
12
కాంక్షంత: కర్మణాం సిద్ధిం
యజంత ఇహ దేవతా: |
క్షిప్రం హి మానుషే లోకే
సిద్ధిర్భవతి కర్మజా

తాత్పర్యము : లోకమున జనులు కామ్య కర్మల యందు జయమును కోరు కారణముగా దేవతలను పూజింతురు. ఈ జగమునందు వారు కామ్యకర్మలకు శీఘ్రముగా ఫలమును పొందుచున్నారు.

భాష్యము : భగవంతుడు అవతారములుగాను, అంశలు గాను విస్తరించి యున్నాడు. ఆయన అంశలే జీవరాశులు. భగవంతుడు అద్వితీయుడు కాబట్టి జీవుడు ఎప్పుడూ భగవంతునితో సమానుడు కాజాలడు. అలాంటి అంశలైన దేవతలు ఈ భౌతిక ప్రపంచాన్ని పరిపాలింతురు. కాబట్టి బ్రహ్మ, శివుడు వంటి దేవతలు సైతమూ అటువంటి అంశలు మాత్రమే. వారు కూడా భగవంతుడిని పూజించుదురు. అయితే అల్ప జనులు భౌతిక లాలసలగుటచే వారి కోరికలను నేరవేర్చుకొనుటకు దేవతలను గాని, ఈ లోకములో శక్తి వంతులను గాని ఆశ్రయించుదురు. ఎవరేని ఒక రాజకీయ నాయకుని సేవించుట ద్వారా ప్రభుత్వము నందు మంత్రి పదవిని పొందిన, గొప్ప అదృష్టవంతుడనని భావించును. కాని ఇవన్నీ అశాశ్వతమని తెలియక జీవుడు మోసపోవును. కాబట్టి బుద్ధిమంతులు శాశ్వతమైన భగవత్సేవనే కోరుకొనవలెను. అయితే అట్టివారు చాలా అరుదని ఈ శ్లోకము తెలియజేయుచున్నది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement