Wednesday, May 8, 2024

ట్రావెల్ ఫ్రెండ్ గృహ‌ప్ర‌వేశం కార్య‌క్ర‌మంలో.. బాల‌కృష్ణ

హీరో బాల‌కృష్ణ తీరే స‌ప‌రేట్..ఆయ‌న కోపిష్టి అనుకుంటారు గానీ..ఆయ‌నంత ఫ్రెండ్లీగా ఎవ‌రు ఉండ‌ర‌ని చెబుతుంటారు ఆయ‌న స‌న్నిహితులు. అందుకు నిద‌ర్శ‌న‌మే ఈ ఘ‌ట‌న‌. సెలబ్రెటీలు ప్రయాణ సమయంలో పక్క వారితో మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపించరు. అలాంటిది కేవలం గంట సమయం ప్రయాణం చేసిన సమయంలో పక్కన కూర్చున్న వ్యక్తితో స్నేహం ఏర్పడటం ఆశ్చర్యం. ప్రయాణ సమయంలో పరిచయం అయిన వ్యక్తితో హీరో బాలకృష్ణ స్నేహం కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా ఆ స్నేహితుడు గృహ ప్రవేశం కార్యక్రమానికి బాలయ్య హాజరు అయ్యారు. తన ట్రావెల్ ఫ్రెండ్ ను సర్ ప్రైజ్ చేస్తూ బాలయ్య అక్కడ సందడి చేయడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే అఖండ.. వీర సింహా రెడ్డి సినిమాల తో బ్యాక్ టు బ్యాక్ భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు బాలయ్య ‘భగవంత్ కేసరి’ సినిమాను అనిల్ రావిపూడి చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement