Friday, May 3, 2024

అక్టోబ‌ర్ లో రామ్ సేతు.. రిలీజ్ డేట్ చెప్పేసిన మేక‌ర్స్.!

ఏడాదికి ఐదారు సినిమాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేస్తుంటారు బాలీవుడ్ స్టార్ అక్ష‌య్‌కుమార్‌. ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కు అక్ష‌య్ కుమార్ న‌టించిన నాలుగు (బ‌చ్చ‌న్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్‌, ర‌క్షాభంద‌న్) సినిమాలు థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యాయి. కాగా క‌ట్‌పుట్లి మాత్రం ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తాజాగా అభిషేక్ శర్మ దర్శకత్వంలో మ‌రోసారి బాక్సాఫీస్ బ‌రిలో దిగ‌బోతున్నారు అక్ష‌య్‌కుమార్‌. యాక్షన్ అడ్వెంచరస్ కథాంశంతో రూపొందుతున్న సినిమా రామ్ సేతు. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నుష్రాత్ బరుచా కథానాయికలుగా నటిస్తున్నారు. టాలీవుడ్ హీరో సత్యదేవ్ రామ్ సేతు సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాతోనే అతడు బాలీవుడ్ లో అరంగేట్రం చేయబోతున్నాడు.

కాగా, ఈ సినిమా అక్టోబ‌ర్ 25న వ‌ర‌ల్డ్‌వైగ్‌గా థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. రామేశ్వరం లోని రామసేతు బ్రిడ్జ్ బ్యాక్ డ్రాప్ లో రామ్ సేతు సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. ఇందులో అక్షయ్ కుమార్ అర్కియాలజిస్ట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఇక‌, ప్రస్తుతం అక్షయ్ కుమార్ సెల్ఫీ, ఓ మై గాడ్ 2 తో పాటు సూరారై పోట్రు రీమేక్ లో నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement