Saturday, April 27, 2024

ఏజెంట్ లో అదిరిపోయే హాలీవుడ్ చేజింగ్ సీన్

అక్కినేని అఖిల్ కెరీర్ ను ప్రారంభించి చాలా ఏళ్ళు అవుతున్నా సరైన హిట్ ని అందుకోలేకపోయాడు. అయితే ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నాడు. దీనితో పాటు సురేందర్ రెడ్డి తో ఏజెంట్ సినిమా కూడా చేస్తున్నాడు అఖిల్. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సిక్స్ ప్యాక్ లుక్ లో అందర్నీ ఆశ్చర్య పరిచాడు అఖిల్.

కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక చేజింగ్ సీన్ ఉంటుందట. ఇది చాలా ప్రత్యేకంగా ఉండబోతుందట. పదిహేను నిమిషాల పాటు సాగే ఈ చేజింగ్ సీన్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. కేవలం ఈ సీన్ కోసం చిత్రబృందం విదేశాలకు వెళ్లి షూట్ చేయనున్నారట. మరి తెలుగు ఆడియన్స్ ని ఏ మేరకు ఇది ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement