Monday, May 6, 2024

పంచె కట్టులో భీమ్లా నాయక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలు గా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక నిత్యామీనన్ పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన మేకింగ్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఒకటి రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఆగస్టు 15 న చిత్ర టైటిల్ ప్రకటన తో పాటు ఫస్ట్ గ్లిమ్ప్ రిలీజ్ చేస్తున్నట్లు తెలుపుతూ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ పోస్టర్ లో పవన్ పంచె కట్టుతో కనిపోయించటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement