Wednesday, May 15, 2024

ప్రభాస్ కొడితే లేవడాలు ఉండవట..!!

కే జిఎఫ్ సినిమా తో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ను సరికొత్తగా డిజైన్ చేశాడట ప్రశాంత్ నీల్. డైలాగ్స్ కూడా చాలా తక్కువగా రాశాడట. కానీ రాసిన డైలాగ్స్ మాత్రం ఎంతో పవర్ ఫుల్ గా ఉంటాయట.

అంతేకాకుండా యాక్షన్ సీన్స్ లో పెద్దగా హడావుడి కూడా ఉండదట. ప్రభాస్ కొట్టగానే తిరిగి లేవడాలు కూడా కనిపించవట. అంతేకాకుండా కొంతవరకు పాత లుక్ లో ప్రభాస్ కనిపిస్తాడని సమాచారం. ఇక కేజిఎఫ్ సినిమాలో తమన్నా తో ఐటెం సాంగ్ చేయించిన ప్రశాంత్ ఇప్పుడు శ్రీనిధి శెట్టి తో ఓ స్పెషల్ సాంగ్ రెడీ చేశాడు. వచ్చే నెల మొదటి వారంలో ఈ పాటను షూట్ చేయనున్నారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement