Monday, April 29, 2024

క‌డుపులో బిడ్డ తంతోంది.. ఇలియాన‌

పెళ్లి కాకుండానే త‌ల్లి అవుతోంది న‌టి ఇలియాన‌.. ఉన్నట్టుండి చాలాకాలం తర్వాత తాను తల్లి కాబోతున్నాన‌ని ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో తెగ సందడి చేసింది. తాను తల్లి కాబోతున్నానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చిన ఈమె తన ఇంస్టాగ్రామ్ పేజీలో రెండు బ్లాక్ అండ్ వైట్ ఫోటో లు షేర్ చేసి తన మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. వారం క్రితం లైట్ బేబీ బంప్ తో కనిపించిన ఈమె ఇప్పుడు గర్భంలో బిడ్డ ఎదుగుతున్న క్రమంలో తన అనుభవాలు, అనుభూతులు ఎలా ఉన్నాయో తెలిపింది. కునుకు తీయనివ్వడం లేదని.. క‌డుపులో బిడ్డ తంతోంద‌ని.. నిద్ర కోసం చాలా తంటాలు పడుతున్నానని చెబుతూ బెడ్ పై లేజీగా పడుకొని ఉన్న సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే తాను మోస్తున్న బిడ్డకి తండ్రి ఎవరు అన్నది మాత్రం చెప్పకుండా దాచేస్తోంది. తెలుగులో అవకాశాలు తగ్గిన సమయంలో బాలీవుడ్ కి మకాం మార్చిన ఈమె అక్కడ కొన్ని సినిమాలలో చేసింది. ఆ తర్వాత కరీనాకపూర్ సోదరుడుతో ప్రేమలో పడింది అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇందులో నిజం తెలియలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement