Saturday, May 18, 2024

టాలీవుడ్ వైపు తాప్సీ చూపులు..!

తాప్సీ పన్ను ఇపుుడు బాలీవుడ్ లో క్రేజీ హిరోయిన్. వరుస అవకాశాలు అందుకుంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. హిందీలో తాప్సీ నటించిన సినిమాలు వరసగా సూపర్ హిట్ అవుతుండటంతో క్రేజీ స్టార్‌గా మారిపోయింది. అయితే బీ టౌన్ లో ఎంత క్రేజ్ సంపాదించుకున్న.. తాను ఎదగటానికి ఉపయోగపడ్డ టాలీవుడ్ ని మాత్రం మరిచిపోలేకపోతోంది తాప్సీ..అందుకే హిందీలో ఎంత బిజీగా ఉన్నప్పటికి తెలుగులో చేయడానికి ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాప్సీ చేతిలో 5 హిందీ సినిమాలునాయి. ‘హసీన్ దిల్ రుబా’, ‘రశ్మీ రాకెట్’, ‘లూప్ లపేటా’, ‘దొబారా’ సినిమాలు ఇప్పటికే షూటింగ్స్ పూర్తయి రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఇక తాప్సి టైటిల్ రోల్ పోషిస్తోన్న మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ ‘శభాష్ మిథూ’ షూటింగ్ దశలో ఉంది. ఇంత బిజీగా ఉన్న తాప్సీ మళ్ళీ టాలీవుడ్ వైపు చూస్తోందట. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అయినా మెప్పించడానికి సిద్దంగా ఉందట. చూడాలి మరి తాప్సీకి మళ్ళీ టాలీవుడ్‌లో అవకాశాలు వస్తాయో లేదు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement