Monday, May 6, 2024

ఇంకో పదిరోజులేనట !! రాధే శ్యామ్ అప్డేట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. కాగా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే షూటింగ్ మొత్తం పూర్తయిందనుకున్న సమయంలో ఇంకాస్త షూటింగ్ బ్యాలెన్స్ ఉందని ఇటీవల రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే షూటింగ్ నిమిత్తం ప్రభాస్ కూడా హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ కు సంబంధించి ఇంకా పది రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. ఈ పది రోజులు షూటింగ్ అయిన తర్వాత మొత్తం సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లేనని తెలుస్తోంది. కాగా ఈ చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు పనిచేస్తుండగా యూవీ క్రియేషన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ ఆదిపురుష్, సలార్ సినిమాలు చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement