Sunday, April 28, 2024

The Got Life | ఈ సినిమాని తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రించాలి : పృథ్వీరాజ్

పృథ్వీరాజ్ సుకుమారన్ లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ ‘ది గోట్ లైఫ్’. ‘ఆడు జీవితం’ అనే పేరుతో ఈ మూవీలో తెలుగులో విడుదల కానుంది. బెన్యామిన్ అనే రచయిత రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా.. బ్లెస్సీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 28న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ఈ మూవీని తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, డైరెక్టర్ బ్లెస్సీ, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, మైత్రీ మూవీ మేకర్స్ వై.రవిశంకర్, శశి పాల్గొన్నారు.

- Advertisement -

హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. సలార్ మూవీలో వరదరాజ మన్నార్ అనే కింగ్ క్యారెక్టర్‌లో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యానని, ఇప్పుడు ‘ఆడు జీవితం’ సినిమాతో నజీబ్ అనే స్లేవ్ క్యారెక్టర్‌తో వస్తున్నానని తెలిపారు. వాస్తవ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని ఆదరించాలని కోరారు. 2019లో షూటింగ్ ప్రారంభించి ఇప్పటికి విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ మూవీ కోసం తాను 31 కిలోలు తగ్గినట్టు తెలిపారు.

డైరెక్టర్ బ్లెస్సీ మాట్లాడుతూ.. దాదాపు 150 రోజులు ఎడారిలో షూటింగ్ చేశామన్నారు. బడ్జెట్ పెరిగినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశామన్నారు. 28న విడుదలయ్యే ఆడు జీవితం మూవీని ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలన్నారు. కేరళలో 250 ఎడిషన్స్ పబ్లిష్ అయిన నవల ఆధారంగా సినిమా చేశామన్నారు. ప్రతి కేరళ వాసికి ఈ గోట్ డేస్ నవల, అందులోని క్యారెక్టర్స్ తెలుసని, జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకు సాగే స్ఫూర్తిని ఈ మూవీ అందిస్తుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement