Sunday, May 5, 2024

తెలుగు నటిపై ముంబయిలో లైంగిక దాడి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం

తెలుగు నటిపై ముంబయిలో లైంగిక దాడి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం ముంబయిలో తెలుగు నటిపై లైంగిక దాడి ఆరోపణలపై ఫిట్‌నెస్ ట్రైనర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండేళ్లుగా ముంబయి, గోవాలో నిందితుడు పలుమార్లు రేప్ చేసినట్టు నటి కంప్లెయింట్ చేసింది. నిందితుడిని ఆదిత్య అజయ్ కపూర్‌గా పోలీసులు తెలిపారు. తనకు కామన్ ఫ్రెండ్ ఇంట్లో ఆదిత్యతో పరిచయం ఏర్పడిందని బాధితురాలు పోలీసులకు తెలిపింది. తర్వాత వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది.

కాగా, తనను పెళ్లి చేసుకోమని అడిగితే కుంటిసాకులు చెప్పి దౌర్జన్యం చేసి శారీరకంగా దాడి చేశాడని, తన ప్రైవేట్ చిత్రాలను బహిరంగపరచి చంపేస్తానని బెదిరించినట్టు నటి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అతని వేధింపులు భరించలేక ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపింది. ఆదిత్య మొబైల్‌లో మహిళ సన్నిహిత చిత్రాలున్నాయని పోలీసులు నిర్ధారించారు. దీనిపై తదుపరి దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement