Saturday, May 18, 2024

Apple: ఐ ఫోన్లలో జీరోడే బగ్స్​.. సెక్యూరిటీ లోపాలను సరిచేసిన ఆపిల్​​!

స్మార్ట్​ఫోన్​ రంగంలో ​ దిగ్గజ కంపెనీ అయిన ఆపిల్​ సంస్థ తన ఉత్పత్తుల కోసం ఎప్పటికప్పుడు సాఫ్ట్​వేర్​ అప్​డేట్స్​ని అందిస్తోంది. ఈ మధ్య జరిగిన ‘గోఫార్’​ ప్రోగ్రామ్​లో పలు కొత్త ప్రొడక్టులను ప్రకటించిన ఆపిల్​ సీఈవో టిమ్​ కుక్​.. ఆ మరుసటి రోజే ‘ఐఓఎస్​ 16 ఆర్​సీ’ అప్​డేట్​ వర్షన్​ని రిలీజ్​ చేశారు. దాంతో పాటు పలు ఆపిల్​ ప్రొడక్స్​లో తలెత్తిన సెక్యూరిటీ లోపాలను సవరించి మరో రెండు అప్​డేట్స్​ని రిలీజ్​ చేసినట్టు ఇవ్వాల (బుధవారం) ఆపిల్​ సంస్థ తెలిపింది.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

Apple iOS, macOSలో తలెత్తిన పలు ఇంటర్నల్​ బగ్స్​ని క్లియర్​ చేసినట్టు ఆపిల్​ సంస్థ వెల్లడించింది. ఈజీగా హ్యాక్​ చేసేందుకు వీలుగా ఉండే జీరో-డే లోపంతో సహా CVE-2022-32917 అని పిలువబడే బగ్స్​, కెర్నల్ ప్రాబ్లమ్​​తో ఎఫెక్ట్​ అయ్యే పలు అంశాలను పరిష్కరించినట్టు తాజా ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా Apple iOS 15.7, iPadOS 15.7, macOS Monterey 12.6, macOS బిగ్ సుర్ 11.7 అప్​డేట్స్​లో బగ్‌ని పరిష్కరించినట్టు ఆపిల్​ సెక్యూరిటీ అప్​డేట్​ టీమ్​ తెలిపింది.

TechCrunch తెలిపిన ప్రకారం.. ఇది ఈ సంవత్సరం Apple ద్వారా పరిష్కరించబడిన ఎనిమిదో జీరో-డే సమస్యగా తెలుస్తోంది. ఈ పరిష్కారాలతో పాటు ఆపిల్ అడ్రస్ బార్ స్పూఫింగ్‌కు దారితీసే సఫారి బ్రౌజర్ వైఫల్యాన్ని కూడా పరిష్కరించినట్టు తెలుస్తోంది.

ఇక.. iOS 16తో అప్​డేట్​ వర్షన్​ అందుబాటులోకి వచ్చింది.​దీంతో పలు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్​ని ఫిక్స్​ చేసినట్టు తెలుస్తోంది. ఇది Apple పాస్‌కీలు, లాక్‌డౌన్ మోడ్‌కు అనుకూలంగా ఉండడం సహా అనేక సెక్యూరిటీ, ప్రైవేట్​ అంశాలను కలిగి ఉంది. “సాఫ్ట్ వేర్‌ను అప్​డేట్​ చేయడం ద్వారా ఆపిల్ పరికరాలు, ప్రైవసీని సేఫ్​గా ఉంచడానికి మీరు చేయగలిగే ముఖ్యమైన విషయాలలో ఒకటి” అని కంపెనీ తెలిపింది. కాగా, iOS, iPadOS, tvOS, watchOS కోసం సాఫ్ట్ వేర్ అప్‌డేట్ చేసిన చేసిన తర్వాత అది పాత వర్షన్​లను తిరిగి పోవడం కష్టమవుతుంది.

- Advertisement -

గత నెలలో యాపిల్ ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు , మాక్‌ల కోసం కొత్త సాఫ్ట్ వేర్ అప్‌డేట్‌లను విడుదల చేసింది. హ్యాకర్లకు చిక్కి దోపిడీకి గురికాకుండా టెక్ దిగ్గజంఆపిల్​ ఇంతకుముందు రెండు సెక్యూరిటీ లోపాలకు పరిష్కారం చూపింది. సఫారి, ఇతర ఆప్‌లకు సహకారిగా ఉండే బ్రౌజర్ ఇంజిన్, ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ప్రధానమైన కెర్నల్‌లో రెండు బగ్స్​ని ఇంతకుముందు కనుగొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement