Friday, April 26, 2024

లైఫ్ ఆఫ్ ముత్తు, ఇది ఆరంభం మాత్ర‌మే.. క్యూరియాసిటీ పెంచుతున్న ట్రైల‌ర్.!

కోలీవుడ్ యంగ్ స్టార్ శింబు హీరోగా గౌత‌మ్ మీన‌న్ డైరెక్ట్ చేసిని యాక్షన్ ఎమోషనల్ సాగా, ‘వెందు తానిందతు కాదు’ తెలుగులో ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ పేరుతో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా రెండు బాగాలుగా తెర‌కెక్క‌స్తున్నారు. ఇక ఈ సినిమా 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాడానికి సిద్దంగా ఉంది. ఈ క్ర‌మంలోనే మూవీ మేక‌ర్స్ సినిమా ప్ర‌మోష‌న్స్ పై దృష్టి పెట్టారు.. దీంతో ఇవ్వాల (బుద‌వారం) ట్రైలర్ ను రిలీజ్ చేశారు మూవీ మేక‌ర్స్.

ట్రైలర్ విషయానికి వస్తే… ”కొన్నిసార్లు నిజం చెప్పడం కథ అల్లడం కంటే కష్టం. ఇది ఒక నిజమైన మనిషి కథ”. అని రమ్య కృష్ణ అద్భుతమైన వాయిస్ ఓవర్‌తో, తెరపై శింబును గ్యాంగ్‌స్ట‌ర్‌గా పరిచయం చేశారు గౌతమ్ మీనన్. తర్వాత ఒక పల్లె నుంచి పట్నం వచ్చిన యువకుడిగా హీరోను చూపించారు. అతడు గ్యాంగ్‌స్ట‌ర్‌ ఎలా అయ్యాడు? మాఫియాలోకి ఎలా వచ్చాడు? అతడి కథ ఏమిటి? అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి.

విజువల్స్ ప్రపంచ స్థాయిలో ఉన్నాయి, AR రెహమాన్ సంగీతం ఈ సినిమాకే ప్రాణం పోసింది. సిద్ధి ఇద్నాని కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో నీరజ్ మాధవ్, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు & తమిళంలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఇషారి.కె. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై గణేష్ నిర్మిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం TS & APలో తమిళ వెర్షన్ సెప్టెంబర్ 15న విడుదల అవుతుండగా, తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 17న విడుదల కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement