Saturday, May 18, 2024

ప్రశాంత్ వర్మ హనుమాన్ లో తేజ సజ్జా !!

ఇటీవల జాంబి రెడ్డి సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు తేజ సజ్జా. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ ఇటీవలే తన పుట్టినరోజు సందర్భంగా హనుమాన్ అనే సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలు మాత్రం చెప్పలేదు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కథానాయకుడిగా తేజ నే మళ్లీ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి కూడా వెళ్లనుందట. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా తేజ చాలా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ఇంద్ర సినిమా లోని తొడ గొట్టి చైల్డ్ ఆర్టిస్ట్ గా తేజ అప్పట్లో మెప్పించాడు. ఆ తర్వాత ఓ బేబీ సినిమాలో సమంత మనవడి గా నటించి ఆకట్టుకున్నాడు. ఆ తరువాత జాంబి రెడ్డి సినిమాతో ప్రేక్షకుల మన్ననలు పొందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement