Thursday, May 2, 2024

క్రిస్ హేమ్స్‌వర్త్ ఎక్స్‌ట్రాక్షన్‌ 2 నుంచి రిలీజ్ అయిన టీజర్…

క్రిస్ హేమ్స్‌వర్త్ ప్రదాన పాత్రలో తెరకెక్కించిన యాక్షన్ డ్రామా ఎక్స్‌ట్రాక్షన్‌. 2020లో నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి మాజీ స్టంట్‌మ్యాన్ సామ్ హార్‌గ్రేవ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇప్పటి వరకు వచ్చిన అత్యుత్తమ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ యాక్షన్ సినిమాలలో ఒకటి అనే చెప్పవచ్చు.

అయితే సినిమా రిలీజ్ అయిన మూడేళ్ల తరువాత సీక్వెల్ సంబంధించిన అప్డేట్ వచ్చింది. కొద్ది సేపటి క్రితం ఎక్స్‌ట్రాక్షన్‌ 2 కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో హెమ్స్‌వర్త్ యాక్షన్ లెజెండ్ గా కనిపిస్తున్నాడు. కాగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో జూన్ 16న విడుదల కానుంది.

ఆండే పార్క్స్ రాసిన గ్రాఫిక్ నవల ‘సియుడాడ్’ ఆధారంగా రూపొందించబడిన మొదటి సినిమాకి ఇది సీక్వెల్. ఎక్స్‌ట్రాక్షన్ 2ని ఆంథోనీ రస్సో, జో రస్సో, మైక్ లారోకా, క్రిస్ హేమ్స్‌వర్త్, పాట్రిక్ నెవాల్ నిర్మించారు. శామ్ హార్గ్రేవ్, ఏంజెలా రస్సో-ఓట్‌స్టాట్, జేక్ ఆస్ట్, బెంజమిన్ గ్రేసన్, స్టీవెన్ స్కావెల్లి, క్రిస్టోఫర్ మార్కస్ మరియు స్టీఫెన్ మెక్‌ఫీలీతో కలిసి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా ఉన్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement