Monday, April 29, 2024

IPL | రికార్డు కొట్టిన చెన్నై.. ఐపీఎల్​-16లో టాప్​ స్కోరు!

లక్నో సూపర్​ జెయింట్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ చితక్కొట్టింది.  ఓపెనింగ్​ జోడీ అయిన రుతురాజ్​ గైక్వాడ్​, కాన్వే కలిసి పటిష్టమైన భాగస్వామ్యం నిర్మించారు. 14 ఓవర్లలో 150 పరుగులు దాటి పోవడంతో ఇక వెనుతిరిగి చూడాల్సిన పనిలేకుండా పోయింది అయితే.. గైక్వాడ్​ 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్యాచ్​ అవుటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కాన్వే 47 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో శివం దూబే (27), మొయిన్​ అలీ (16), పరుగులు చేశారు.

ఇక.. మిగతా వారు పెద్దగా ఆటతీరు కనబర్చలేదు. అయితే చివరలో వచ్చిన కెప్టెన్​ ధోనీ సిక్స్​లతో అభిమానులకు కనువిందు చేశాడు. రెండు బాల్స్​ని సిక్స్​లుగా మలిచిన ధోనీ, మూడో బాల్​కి క్యాచ్​ అవుటయ్యాడు. అప్పటికే చెన్నై ఈ సీజన్​లో ఇప్పటి వరకూ ఏ జట్టు చేయని 217 పరుగుల రికార్డు స్కోరు చేసింది. ఇక చివర్లో అంబటి రాయుడు 27, శాంత్నర్​ 1 కలిసి ఆట ముగించారు. కాగా ఈ  మొత్తం స్కోరు ఐపీఎల్​ 16 సీజన్​లో ఇదే టాప్​ స్కోరుగా నిలిచింది. ఇక.. 218 పరుగుల టార్గెట్​తో లక్నో బ్యాటింగ్​కు దిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement