Wednesday, May 8, 2024

తమిళ స్టార్ హీరోకు అక్కడ తగ్గింది!! ఇక్కడ మాత్రం

తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన సూరరై పోట్రు తెలుగులో ఆకాశం నీ హద్దురా పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలోని కాటుక కనులే పాట సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ పాటను భాస్కరభట్ల రాశారు. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇదిలా ఉండగా కాటుక కనులే పాట ఏకంగా 100 మిలియన్ వ్యూస్ ను అందుకుంది. ఈ పాట ఆ స్థాయిలో వ్యూస్ ని అందుకున్న తొలి తెలుగు డబ్బింగ్ పాట గా నిలిచింది. ఇక జి వి ప్రకాష్ ఈ పాటకు సంగీతం అందించగా దీక్షిత పాడారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ పాట తమిళంలో కేవలం 63 మిలియన్ల వ్యూస్ ను మాత్రమే రాబెట్టగలిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement