Wednesday, March 27, 2024

300 కుక్కులను చంపి… గోయ్యిలో పడేశారు

మూగజీవాలపై పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం పంచాయతీ అధికారులు ప్రదర్శించిన తీరుపై దుమారం రేపుతోంది. విశ్వాసానికి మారుపేరు అయిన గ్రామసింహాంలను అతి పాశవికంగా చంపేశారు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 300 మూగజీవాలను పొట్టున పెట్టుకున్నారు.  ఎలాంటి కనికరం చూపకుండా విషపు ఇంజక్షన్లతో చంపేశారు. చనిపోయిన కుక్కల కళేబారాలను చెరువు వద్ద గొయ్యిలో పడేశారు. కనీసం మట్టి కూడా పూడ్చకుండా వదిలేశారు. ఈ ఘటనపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. ఈ చర్యలకు పాల్పడ్డ పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్‌లో ఫైట్‌ ఫర్‌ యనిమల్ అనే ఓ ఎన్జీవో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు కుక్కలు తరచూ దాడులకు తెగపడుతున్నాయనే వాటిని చంపామని పంచాయతీ అధికారులు చెబుతున్నారు. స్థానిక ప్రజలు, రోడ్డుపై వేళ్లే వాహనదారులకు భయాందోళనకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కారణంగా విషం పెట్టి చంపినట్లు స్పష్టం చేశారు.

శునకాలను ఇష్టారీతీగా చంపడాన్ని ఫైట్ ఫర్ యనిమల్స్ సంస్థకు చెందిన చల్లపల్లి శ్రీలత ఖండించారు. జంతువులను హింసించడాన్ని పాపంగా అని అన్నారు. ప్రకృతిలో మానవులకు జీవించే హక్కు ఆ భగవంతుడు ఎలా ఇచ్చాడో.. అదే విధంగా మూగజీవాలకు ఇచ్చాడన్న విషయాన్ని గుర్తు చేశారు. కొందరు అమానవీయ వ్యక్తులు వల్ల హింసకు గురైతే.. తాను రంగంలోకి దిగుతానని అన్నారు. ఎన్ని ఒత్తిళ్లు.. బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. చట్ట పరిధిలో జంతుహింసకు పాల్పడిన వారిపై పోరాటం చేస్తానని చెప్పారు. తన లక్ష్య సాధనలో చల్లపల్లి శ్రీలత ధైర్యంగా ముందుకు సాగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement