Sunday, May 26, 2024

సునీల్ కనబడుటలేదు ట్రైలర్ రిలీజ్

ప్రముఖ కమెడియన్ సునీల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం కనబడుటలేదు. ఎం బాల రాజు దర్శకత్వంలో స్పార్క్, శ్రీపాద ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇక ఈ నెల 13న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ ట్రైలర్ చూస్తుంటే ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా తెలుస్తోంది. అందులో ఒక ప్రేమికుడు సడన్ గా కనిపించకుండా పోవడం, అదే సమయంలో ఒక శవం కనిపించడం అనుమానాస్పద కేసును పరిష్కరించడానికి డిటెక్టివ్ గా సునీల్ ను నియమించడం… ఆయన ఆ కేసును ఎలా డీల్ చేస్తారు.. ఏ విధంగా నేరస్తులను పట్టుకుంటారు అనేది ఈ సినిమా కథాంశం గా అర్థమవుతుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement