Friday, May 3, 2024

Sunil : ఇక క‌న్న‌డంలోనూ సునీల్ విల‌నిజం…

తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తున్నక‌మెడియ‌న్ క‌ప్ హీరో క‌మ్ విల‌న్ సునీల్ లేటెస్ట్ గా కెరీర్ లో మొదటిసారి కన్నడ నుంచి అవకాశం అందుకున్నాడు. కన్నడలో సుదీప్ హీరోగా చేస్తున్న మ్యాక్స్ సినిమాలో సునీల్ విలన్ గా ఛాన్స్ కొట్టేశాడు. తెలుగులో ఇప్పటికే వరుస సినిమాలు చేస్తున్న సునీల్ తమిళ కన్నడ భాషల్లో కూడా పాగా వేయాలని ఫిక్స్ అయ్యాడు.

అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగ పరచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. మ్యాక్స్ సినిమాలో సునీల్ పాత్ర కూడా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది. సుదీప్ హీరోగా విజయ్ కార్తికేయ డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సునీల్ నటించడంతో ఈ సినిమాపై తెలుగులో కూడా సూపర్ బజ్ ఏర్పడుతుంది. సుదీప్ సరసన సిమ్రత్, సంయుక్త హోర్నాడ్ నటిస్తున్న ఈ సినిమాకు అంజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement