Saturday, May 4, 2024

సుమ‌న్ చేతుల మీదుగా ‘హ‌ర ఓం హ‌ర’ మూవీ లోగో విడుద‌ల..

యూవీటీ స్టూడియోస్ హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ, శ్రియా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ‘హర ఓం హర’ అనే సినిమాను నిర్మిస్తున్నాయి. కనిక, ఆమని, రవివర్మ, జ్యోతి రెడ్డి, మేక రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను దేవేంద్ర మదన్ సింగ్ నేగి, అశోక్ ఖుల్లార్ నిర్మిస్తుండగా.. షేర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను న‌టుడు సుమ‌న్ రిలీజ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా సుమన్ మాట్లాడుతూ, “సినిమా మంచి విజయం సాధించాలని, దర్శకుడు షేర్ ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్ళాలి” అంటూ చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, టీఎఫ్‌సీసీ వైస్ చైర్మన్ గురు రాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొని మూవీ టీంకి తన అభినందనలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement