Sunday, April 28, 2024

అప్పుడు తమ్ముడు…ఇప్పుడు అన్న మధ్యలో కృతి ?

ఉప్పెన సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది హీరోయిన్ కృతి శెట్టి. తన అందంతో అభినయంతో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ఒకటి నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న శ్యామ్ సింగ రాయ్, అలాగే రామ్ పోతినేని, లింగుస్వామి అలాగే సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలలో నటిస్తోంది.

ఇదిలా ఉండగా మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయట. అందులో ఒకటి సుకుమార్ శిష్యుడు ఆయన కార్తీక్ దండు చిత్రం ఒకటి. బుచ్చిబాబు సాన తర్వాత సుకుమార్ తన శిష్య బృందం లో నుంచి కార్తిక్ ను బయటకు పంపిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించనున్నారట. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఇందులో కూడా హీరోయిన్ గా కృతిని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా వినిపించటం జరిగిందట. అన్నీ సెట్ అయితే ఈ సినిమాలో కూడా కృతి నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement