Monday, April 29, 2024

డబ్బింగ్ కంప్లీట్ చేసిన సుధీర్ బాబు

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. నటుడిగా తానేంటో నిరూపించుకున్న సుధీర్ బాబు సరైన హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. కాగా ప్రస్తుతం కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ శ్రీదేవి సోడా సెంటర్ సినిమా ద్వారా సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సుధీర్ బాబు. అయితే తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారు సుధీర్ బాబు. ఇదే విషయాన్ని చెబుతూ ట్విట్టర్ లో వీడియోను పోస్ట్ చేశారు. ఇక సుధీర్ బాబు ఇందులో సూరి బాబు అనే లైటింగ్ బాయ్ పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే ఈ సినిమా 70ఎమ్ ఎమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు. అలాగే మణిశర్మ సంగీతం అందించగా ఇప్పటికే విడుదలైన టీజర్ లుక్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

https://twitter.com/isudheerbabu/status/1408623859486523392?s=19
Advertisement

తాజా వార్తలు

Advertisement