Saturday, May 18, 2024

అలసటకు ముందు ఈశ్వరీయ స్మృతి

ఆఫీస్‌ మరియు దుకాణ పనులు తరువాత అలసట వస్తే అలసటకు ముందు లేక ఆహారమే ”ఈశ్వరీయ స్మృతి”. ఈశ్వరీయ స్మృతి అల సటను దూరం చేస్తుంది కానీ అలసట కలిగించదు. ఇంతే కాకుండా మనం ఈవ్వరీయ స్మృతి మహత్యాన్ని గ్రహించనపుడే అలసట, బాధ కలుగుతుంది. అలసట చెందిన వాళ్ళు తమకు ప్రియమైన స్నేహితులు, సంబంధీకులకు రోగాలు వస్తే మేలుకొని ఉండాల్సి వస్తే మేలుకొనరా! ఒక అతనికి ఏదైన అత్యవసరమైన పని గురించి టెలిగ్రాం వస్తే వెళ్ళరా! విద్యార్థులు పరీక్షలు సమీపిస్తుంటే రేయింబవళ్ళను మరిచి అలసట శబ్ధాన్ని కూడా తేలిక చేసికొని తమ భవిష్యత్తును ఆలోచించి పరీక్షా పరిణామాన్ని ఎదురుగా పెట్టుకొని మనసు పెట్టి ఎక్కువ పరిశ్రమ చేయుట లేదా? కావున ”అలసట – అలసట” అనే శబ్దాలు ఎవరినోటివెంట వస్తాయంటే ” ఈ సంగమయుగంలో స్మృతి యాత్ర చేయుట చేత మనకు భవిష్యత్తులో 21 జన్మల వరకు ఏ లోటు లేనటువంటి తరగని సుఖాలు లభిస్తాయి” అనే నిశ్చయం లేని వారి నోటివెంట వస్తాయి. మనకు ఆరోగ్యం, అందం, ఐశ్వర్యం, శాంతి అన్ని లభిస్తాయి. మనకు లభించని వస్తువుగాని సుఖంగానీ ఉండదు. అపుడు మనం పొట్ట కూటి కోసం ఇంత చెమటలు కార్చాల్సిన అవసరం లేదు. ఈ విషయం చక్కగా అర్థం చేసికొన్న వ్యక్తి నేనిపుడు అలసిపోయాను. కొంచెం సేపు ముచ్చట్లు పె ట్టుకొనాలి, వి శ్రాంతి తీసికొనాలి అని ఎల అనగలడు. జన్మ జన్మాంతరాలుగా మానవులు విశ్రాంతి తీసికొంటూనే వచ్చారు. వ్యాపార వ్యవహాఆరాలే చేస్తూ వచ్చారు. మరల వాళ్ళే ”మేమే చిక్కులలో పడి వున్నాము” అని కూడా అంటారు. కల్పం మొత్తంలో ఇదే అంతిమ జన్మ. దానిలో కొంచెం మాత్రమే సమయం వున్నది. శివబాబా ”మిగిలిన ఈ కొద్ది సమయంలోనైనా సరే కేవలం ప్రతిరోజు 8 గంటలు నన్ను జ్ఞాపకం చేసికొనట్లయితే నేను మీకు 21 తరాల వరకు సంపూర్ణ స్వర్గ సుఖాలిస్తాను” అంటున్నారు. ఇందులో కూడా శివబా4బా లౌకిక వ్యాపారాలు వద్దని ఆటంకం చేయరు. అలాంటప్పుడు మనిషి బుర్ర పాడైపోయిందా? లేక మాయ వారి తెలివిని పాడు చేసిందా? చాలా కాలం గడిచిపోయింది. ఇపుడు కొంచెం సమయమే ఉంది ఇపుడు నేనుజ్ఞానం తెలుసుకొని నారాయణుని పదవి కోసం పురుషార్థం చేయాలి” అనే ఆలోచన రావడం లేదు. భక్తి మార్గంలో, నిర్లక్ష్యం లోనే ప్రవర్తిస్తూ వచ్చాము. కాని ఇపుడు స్వయంగా భగవానుడు ముఖ్యంగా మనకు విధి ఇచ్చుటకు వచ్చారు. ఇపుడు ఈ నిర్లక్ష్యం చాలా హానికరమైనది.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement