Sunday, April 28, 2024

రాజ రాజ చోర థియేటర్స్ లోనే…డేట్ కూడా ఫిక్స్ – అఫీషియల్

డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు హీరో శ్రీ విష్ణు. ప్రస్తుతం శ్రీ విష్ణు భళా తందనాన సినిమా తో పాటు రాజ రాజ చోర సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పటికే రాజరాజ చోర సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో మేఘా ఆకాష్, సునయన శ్రీ విష్ణు సరసన హీరోయిన్స్ గా నటించారు.

హసిత్ గోలి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇదిలా ఉండగా ఈ నెల 19న థియేటర్స్ లో రాజరాజ చోర సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ ని రిలీజ్ చేస్తూ… కింగ్ సైజ్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అంటూ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement