Thursday, May 2, 2024

లైక్ ఫాదర్.. లైక్ సన్..: పవన్ కొడుకుపై కాంగ్రెస్ నేత కామెంట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాటలో ఆయన తనయుడు అకిరా నందన్ కూడా కర్రసాములో ఆరితేరాడు. అకీరా కర్రసాములో శిక్షణ తీసుకుంటున్న వీడియో ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. అకీరా కర్ర తిప్పుతుంటే ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోయారు. ఈ వీడియోపై సెలెబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు. తాజాగా అకీరా వీడియోపై తెలంగాణ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ పై ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘అకీరా నందన్.. నీకు మూడేళ్ళ వయసు ఉన్నప్పుడు 2007లో తొలిసారి నిన్ను చూశాను. నిన్ను ముద్దు చేసిన క్షణాలు ఇంకా గుర్తున్నాయి. ఇప్పుడు ఇలా నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. పొడవైన వ్యక్తిగా, అందగాడిగా మారావు. నీకిక ఆకాశమే హద్దు. లైక్ ఫాదర్.. లైక్ సన్.. గాడ్ బ్లెస్ యు’ అని శ్రవణ్ కుమార్ ట్వీట్ చేశారు. 

కాగా, పవన్ కళ్యాణ్, శ్రవణ్ కుమార్ మధ్య స్నేహం ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచే ఉంది. పవన్, శ్రవణ్ కలసి పలు ప్రాంతాల్లో పీఆర్పీ కోసం ప్రచారం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement