Friday, April 19, 2024

610 కోట్లు కాంట్రాక్టు దక్కించుకున్న ఫుట్‌బాల్‌ స్టార్‌ మెస్సీ..

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్ లియెనల్ మెస్సీ అదిరిపోయే ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ లీగ్‌–1లో ఆడేందుకుగాను రెండు సంవత్సరాలకు మెస్సీకి దాదాపు ఫ్రెంచ్‌ క్లబ్‌ పారిస్‌ సెయింట్‌ జెర్మయిన్‌ (పీఎస్‌జీ) రూ. 610 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తంది. ఈ ఒప్పందానికి సంబంధించి అధికారిక ప్రకటన నేడు వెలువడనుంది. కాగా ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల మెస్సీతో కాంట్రాక్ట్‌ రెన్యువల్‌ చేసుకునేందుకు సుముఖంగా లేమని బార్సిలోనా ఫుట్‌బాల్‌ క్లబ్‌ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆకస్మిక ప్రకటన నేపథ్యంలో అభిమానులు షాక్‌కు గురయ్యారు. ప్రతిష్టాత్మక కోపా అమెరికా 2021లో అర్జెంటీనా విజయం తర్వాత సెలవుల్లో ఉన్న మెస్సీ.. క్లబ్‌లో చేరిన మరుసటి రోజే ఈ మేరకు ప్రకటన జారీకావడం గమనార్హం. మెస్సీతో బార్సిలోనా క్లబ్‌.. కాంట్రాక్ట్‌ రెన్యువల్‌ ఉండొచ్చని భావించగా ఈ హఠాత్పరిణామంతో ఫ్యాన్స్‌ విస్మయానికి గురయ్యారు. 

ఇది కూడా చదవండి: పూలతో మాస్క్..పెళ్లిలో వధువువరులు ఫ్లాట్ అవ్వాల్సిందే..

Advertisement

తాజా వార్తలు

Advertisement