Thursday, May 9, 2024

మెదక్ జిల్లాలో వ్యాపారి హత్య కేసును ఛేదించిన పోలీసులు

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట శివారులో జరిగిన వ్యాపారి ధర్మాకర్ శ్రీనివాస్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. హత్య జరిగిన 24 గంటల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక లావాదేవీలే వ్యాపారి ధర్మాకర్‌ శ్రీనివాస్‌ హత్యకు కారణమని నిర్ధారించారు. ముగ్గురు వ్యక్తులు శ్రీనివాస్‌ను కత్తితో పొడిచి చంపినట్లు గుర్తించారు. శ్రీనివాస్‌ మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టి నిప్పంటించారని, సాక్ష్యాలను మాయం చేసేందుకే దహనం చేసినట్లు గుర్తించారు.

వివరాల్లోకి వెళ్తే.. ధర్మాకర్ శ్రీనివాస్ మరొకరితో కలిసి రూ. కోటిన్నర లోన్ తీసుకున్నారు. ఆ డబ్బు లోన్ కట్టే వ్యవహారంలో విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో కొన్ని రోజులుగా శ్రీనివాస్ లోన్ చెల్లించకపోవడంతో శ్రీనివాస్‌పై పార్ట్‌నర్‌ కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో సుపారి ప్లాన్‎తో హత్య చేయించాడు. మంగళవారం సాయంత్రం దుండగులు రామాయంపేట రూట్‎లో శ్రీనివాస్‌ను అతి కిరాతకంగా హత్య చేశారు. మృతదేహంతో ఆరుగంటల పాటు కారులోనే తిరిగినట్లు పోలీసుల విచారణలో నిందితులు తెలిపారు. కాగా నిందితులను బుధవారం సాయంత్రం 4 గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ వార్త కూడా చదవండి: అమరావతి రైతుల ఉద్యమంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement