Thursday, May 16, 2024

ముక్కు కోసం లక్షల ఖర్చు: శృతి హాసన్

నటి శృతిహసన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే ఈ అమ్మడు ఎన్నో విషయాలను వెల్లడించడంతో పాటు తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఇందులో ఓ నెటిజన్ ఆమె బాడీ పార్ట్‌పై కామెంట్స్ చేశాడు. ఈ సెషన్‌లో భాగంగా ఓ నెటిజన్ ‘మీ బాడీ మొత్తంలో మీకు నచ్చిన పార్ట్ ముక్కే అనుకుంటా కదా’ అని అడిగాడు. దీనికి ఆమె ఏమాత్రం సిగ్గు పడకుండా ‘అవును. అందుకోసమే కదా దానికి చాలా లక్షల రూపాయలు ఖర్చు చేశాను’ అంటూ ప్లాస్టిక్ సర్జరీ జరిగిన విషయాన్ని గుర్తు చేసింది. శృతి హాసన్ ఇచ్చిన ఈ జావాబుపై నెటిజన్ల నుంచి విభిన్నమైన కామెంట్లు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి: జగ్గయ్యపేట ఎమ్మెల్యేను అడ్డుకున్న తెలంగాణ పోలీసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement