Monday, May 13, 2024

ఎస్ ఆర్ కళ్యాణమండపం EST.1975 @ పబ్లిక్ టాక్

రాజావారు రాణి గారు సినిమా తో హీరోగా పరిచయం అయ్యాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో కిరణ్ కు వరుస అవకాశాలు వచ్చాయి. కాగా నేడు శ్రీధర్ గాదే దర్శకత్వంలో కిరణ్ నటించిన ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు ,టీజర్ అన్ని కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా యూత్ ను అన్ని విధాలా ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమాను హైలైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రమోద్, రాజు కలిసి నిర్మించారు.

ఇక సినిమా విషయానికి వస్తే సినిమా చూసిన ఆడియన్స్ సినిమాలో సాయి కుమార్ కిరణ్ అబ్బవరం మధ్య ఎమోషనల్ సీన్స్, అలాగే యాక్షన్ సీన్స్ హైలెట్ గా ఉన్నాయని అంటున్నారు. అలాగే ఈ సినిమా ఒక ఎమోషనల్ గా సాగే ఫ్యామిలీ డ్రామా అని చెబుతున్నారు. అయితే అప్పుడప్పుడు కాస్త స్లోగా కథ నడిచినట్లు అనిపిస్తుందని మిగిలినదంతా చాలా బాగుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా ఖుషి మూవీ సీన్స్ ఉన్నాయని సెకండాఫ్ లో పోకిరి సీన్ కూడా సూపర్ గా ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా కచ్చితంగా థియేటర్స్ లో చూడాల్సిందేనని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement