Friday, October 4, 2024

Polling: ప్రారంభమైన నాలుగో విడత పోలింగ్‌

నాలుగో విడత పోలింగ్‌ ప్రారంభం అయింది. నాల్గోవిడతలో10 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల పరిధిలోని 96 లోక్‌సభ స్థానాల్లో ఇవాళ ఓటింగ్‌ జరగనుంది.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణలో 17, ఉత్తర ప్రదేశ్‌లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, పశ్చిమ బంగాల్‌లో 8 చొప్పున, బిహార్‌లో 5, ఒడిశా, ఝార్ఖండ్‌లో 4 చొప్పున, జమ్ముకశ్మీర్‌లో ఒక లోక్‌సభ నియోజకవర్గంలో  పోలింగ్ ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఉదయాన్నే ఓటర్లుక్యూ కట్టారు.

లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 175 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఒడిశా శాసనసభలోని 28 స్థానాలకు కూడా పోలింగ్ జరగనుంది. 96 లోక్‌సభ స్థానాలకు 1,717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 8.73 కోట్ల మంది మహిళలతో సహా మొత్తం 17.70 కోట్ల మంది ఓటర్లను సులభతరం చేసేందుకు ఎన్నికల సంఘం 1.92 లక్షల పోలింగ్ కేంద్రాల వద్ద 19 లక్షల మందికి పైగా ఎన్నికల అధికారులను మోహరించింది. నిష్పక్షపాతంగా ఓటింగ్ జరిగేలా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా పరిశీలకులు, మానిటరింగ్ బృందాలను నియమించారు. దేశంలో మొదటి మూడు దశల్లో ఓటింగ్ జరిగింది. మొదటి మూడు దశల్లో వరుసగా 66.14శాతం, 66.71శాతం, 65.68శాతం ఓటింగ్ శాతం నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement