Friday, May 3, 2024

పుట్టిన రోజున ప్ర‌త్యేక‌పూజ‌లు.. వైర‌ల్ గా ఆదాశ‌ర్మ వీడియో

త‌న పుట్టిన‌రోజున శివాల‌యంలో ప్ర‌త్యేక‌పూజ‌లు చేసింది హీరోయిన్ ఆదాశ‌ర్మ. అప్ప‌టి ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్ అవుతున్నాయి. కాగా ది కేరళ స్టోరీ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అంతేకాదు ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా న‌టి ఆదాశర్మ కి ముందు కంటే ఎక్కువ క్రేజ్ లభించిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఆమెకు సంబంధించి వీడియో, ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే తాజాగా మే 11న పుట్టినరోజు జరుపుకున్న ఈ ముద్దుగుమ్మ గర్భగుడిలో శివుడికి దగ్గరగా కూర్చుని శివతాండవం మంత్రాలను ఉచ్చరించారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన వీడియో ని కూడా నెట్టింట షేర్ చేశారు ఆదాశర్మ. ఇది చూసిన చాలా మంది ఆమె భక్తి భావానికి, మంత్రాన్ని ఉచ్చరిస్తున్న తీరుకు ఫిదా అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement