Thursday, May 9, 2024

నెల్లూరు ప్రజలకు థాంక్స్….సోనూసూద్

కరోనా సమయంలో పేద ప్రజలకు సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు బాలీవుడ్ నటుడు సోనుసూద్. సహాయం అని అడిగిన ప్రతి ఒక్కరికి తన వంతు సహాయం చేసి వారి పాలిట దేవుడు అయ్యాడు. అయితే ఇటీవల ఆక్సిజన్ ప్లాంట్ లను కూడా ఏర్పాటు చేస్తున్నాడు సోనూసూద్. కాగా అవి నెల్లూరు కు కూడా చేరుకున్నాయి. దీంతో సోనూసూద్ ఫోటోలకు హారతులు ఇస్తూ… సంబరాలు చేసుకుంటున్నారు స్థానికులు.

అయితే ఇదే విషయంపై ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు సోనూసూద్. నెల్లూరు ప్రజలకు కృతజ్ఞతలు. ఆక్సిజన్ ప్లాంట్ చాలా మంది ప్రాణాలను కాపాడుతుందని చెప్పుకొచ్చారు సోను.

Advertisement

తాజా వార్తలు

Advertisement