Monday, April 29, 2024

ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న శివకార్తికేయన్ ‘ప్రిన్స్’.. డిజిట‌ల్‌ స్ట్రీమింగ్ ఎప్ప‌టి నుంచి అంటే..

శివకార్తికేయన్ నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘ప్రిన్స్’ అక్టోబర్ 21న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల నుండి మంచి టాక్ నే సొంతం చేపుకుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, డి. సురేష్ బాబు, పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మించారు.. శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క నటించిన ఈ సినిమా ఒక ప్రేమ కథతో కూడిన నవ్వుల అల్లరి అని చెప్పొచ్చు.

ఈ సినిమాకి ఎస్.ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు. కాగా, థియేట్రికల్ రిలీజ్ అయ్యి దాదాపు ఒక నెల అవుతోంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ వేదిక అయిన‌ డిస్నీప్ల‌స్‌ హాట్‌స్టార్‌లో నవంబర్ 25వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement