Friday, April 26, 2024

నెట్ ఫ్లిక్స్ లో ‘శ్యామ్ సింగ రాయ్’

నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ‘శ్యామ్ సింగ రాయ్’ డిసెంబర్ 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. కలకత్తాలో 70వ దశకంలో కొనసాగిన దేవదాసీ వ్యవస్థ చుట్టూ ఈ కథ నడుస్తుంది. నాని రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తే, నాని సరసన సాయిపల్లవి .. కృతిశెట్టి .. మడోన్నా కథానాయికలుగా అలరించారు. బెంగాలీ యువతిగా సాయిపల్లవి ఆకట్టుకుంది.

చాలా కాలం తరువాత నాని ఖాతాలో మరో హిట్ ను జమచేసింది. అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ‘నెట్ ఫ్లిక్స్’ వారు ద‌క్కించుకున్నారు. రేపటి నుంచి ఈ సినిమాను స్టీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా తాజాగా రిలీజ్ చేశారు. ఇక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్, టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement