Thursday, May 9, 2024

శివాజీరాజా ఇలా అయిపోయాడేంటి !!

ఇండస్ట్రీలో శివాజీరాజా గురించి పరిచయం అవసరం లేదు. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు శివాజీరాజా. మొత్తం 400లకు పైగా సినిమాల్లో నటించారు. అంతేకాకుండా మా అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు శివాజీ రాజా. ఇదిలా ఉండగా బొద్దుగా కనిపించే శివాజీరాజా ఇప్పుడు సన్నంగా కనిపించి అందరికీ షాకిచ్చాడు. అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గతేడాది ఆయన గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ఆ తరువాత కొలుకున్నాక కూడా ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఇంతవరకు మీడియా ముందుకు రాని శివాజీ రాజా…ఇప్పుడు సడన్ గా ఇంత సన్నగా కనిపించేసరికి శివాజీ రాజా ఆరోగ్యంపై సినీ అభిమానులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement